సౌత్ లో స్టార్ హీరోయిన్ స్థానం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న అందాల భామ మాళవిక మోహనన్. నటిగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం సొంతం చేసుకొని లైమ్ లైట్ లోకి వచ్చింది.
ఆ తరువాత ఏకంగా ఇలయదలపతి విజయ్ కి జోడీగా మాస్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ తమిళంలోనే ధనుష్ కి జోడీగా నటించింది. ఈ మూవీకి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ప్రభాస్ కి జోడీగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే రాజా డీలాక్స్ సినిమాలో నటిస్తుంది.
ఈ మూవీపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. దీని తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని మాళవిక మోహనన్ భావిస్తుంది. ఈ హాట్ బోల్డ్ బ్యూటీకి సినిమాల ద్వారా వచ్చిన ఫేమ్ కంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో భాగా గుర్తింపు వచ్చింది.
మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు తరువాత హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. ఈ నేపధ్యంలో రెగ్యులర్ గా ఫోటోషూట్ లు చేసుకుంటుంది. హాట్ హాట్ డ్రెస్సులతో ఆమె ఫోటోలు చూడటానికి లక్షల సంఖ్యలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
తాజాగా ఆమె శారీలో ఫోటో షూట్ చేసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. హాట్ లుక్స్ తో హ్యాండ్స్ లేని బ్లౌస్ తో ఆ శారీలో హొయలు పోతూ ఉంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు.