టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల భూమా మౌనికను వివాహం చేసుకున్న ఆయన ఆమె మొదటి భర్త సంతానాన్ని కూడా కొడుకుగా స్వీకరించడం జరిగింది. ఇక పిల్లాడి పేరు ధైరవ్ నాగిరెడ్డి. వివాహమైన వెంటనే అబ్బాయిని తన కొడుకుగా మనోజ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం మరియు అందరి చేత ప్రశంసలు అందేలా చేస్తుందని అన్నారు . ఇక తనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతిగా అబ్బాయిని అభివర్ణించాడు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అంటూ కూడా తెలపడం జరిగింది.
![ఎమోషనల్ అవుతున్న మంచు మనోజ్.. ఏమైందంటే..? 2 ఎమోషనల్ అవుతున్న మంచు మనోజ్.. ఏమైందంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-02T143229.426.jpg)
అయితే వాళ్ళ పెళ్లి తర్వాత ధైరవ్ మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నామని అన్నారు . ఈ సందర్భంగా ఒక సుదీర్ఘ నోటును కూడా పంచుకోవడం జరిగింది అని చెప్పారు . అపూర్వమైన రోజున లార్డ్ శివ బాబు రూపంలో మాకు వెలకట్టలేని నిధిని బహుమతిగా ఇచ్చాడు అంటూ ఎమోషనల్ అయ్యారు. ధైరవ్ రాక మాకు ఒక సంఘటన కాదు మా కొత్త ప్రయాణానికి నాంది. ఈ ప్రయాణంలో నేను ప్రతి రోజును కూడా ఆస్వాదిస్తున్నాను. మీ అమాయకత్వం , ప్రేమ, నీ నవ్వులు నన్ను నడిపించే కాంతులు.. మౌనిక నీ ప్రేమ నా జీవితాన్ని అందంగా మార్చేశాయి అని సుదీర్ఘంగా రాసుకొచ్చాడు మనోజ్.
మనోజ్ కు అబ్బాయి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఇక అబ్బాయికి సంబంధించిన ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేస్తూ తన ప్రేమను వెల్లడించారు మనోజ్. ఇకపోతే భూమా మౌనిక, మనోజ్ లు ఇద్దరు కూడా వేరువేరుగా వివాహాలు చేసుకుని వారి ఇద్దరు భాగస్వాములతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారు. ఇక మౌనికను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డాను అని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.