మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీకి ఎప్పుడు దూరంగా ఉండే మంచు మనోజ్ తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్ అంటే సెలబ్రిటీలకే కాదు అభిమానులకు కూడా విపరీతమైన గౌరవం , అభిమానం కూడా.. ఇదిలా ఉండగా మంచు మనోజ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ అవుతుంది . ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అంటూ ఒక శుభవార్త హల్చల్ అవ్వడం తో అటు మంచు అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ఖుషీ లో ఫ్యామిలీ..! 2 తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ఖుషీ లో ఫ్యామిలీ..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-10T104656.066.jpg)
అసలు విషయంలోకెళితే ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరూ కూడా మొదటి పెళ్లిళ్ళను బ్రేకప్ చేసుకున్నారు .. ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అయితే మంచు మనోజ్ కు మొదటి భార్యతో పిల్లలను కలగలేదు. కానీ మౌనిక రెడ్డికి మొదట భర్త తో ఒక కొడుకు కూడా జన్మించాడు . అయితే వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత శివుడు ఇచ్చిన బిడ్డ అంటూ మౌనిక రెడ్డి కొడుకుని మంచు మనోజ్ తన సొంత బిడ్డ లాగా స్వీకరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మంచు మనోజ్ , మౌనిక దంపతులకు కూడా పిల్లలు పుడితే బాగుంటుంది అని మంచు లక్ష్మి తన అభిప్రాయంగా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
అందులోనూ మంచు విష్ణు, లక్ష్మీ పిల్లలతో మంచు మనోజ్ గా బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు తాను కూడా ఒక బిడ్డకు తండ్రి కావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా తల్లి కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒక జంటకు మాత్రం పెళ్ళైన మూడు నెలల్లో ఇలాంటి వార్తలు రావడం సహజం అని . మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే మంచు మనోజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే అని అన్నారు .