తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు మంచు విష్ణు స్పష్టంగా తెలియచేసారు . భారీ బడ్జెట్ తో ‘భక్తకన్నప్ప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీయనున్నామని… సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని కూడా అన్నారు. ప్రస్తుతం ఓ రియాల్టీ షో చేస్తున్నామని… చాలా ప్రశ్నలకు అందులో సమాధానాలు లభిస్తాయని చెప్పారు.
![ఎమ్మెల్యేగా మంచు విష్ణు పోటీ ! 2 ఎమ్మెల్యేగా మంచు విష్ణు పోటీ !](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-18T133738.535.jpg)
పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని… అందులో ఎలాంటి సందేహం లేదని నటుడు మంచు విష్ణు అన్నారు. సినిమాలపరంగా ఆయన పవర్ ఏంటో అందరికీ తెలుసని ఓ ఇంటర్వ్యూలో తెలియచేసారు . అయితే పవన్ రాజకీయాల్లో విజయం సాధిస్తారా అనే ప్రశ్నకు… విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి తానేమీ బ్రహ్మంగారు కాదని చెప్పారు. సినిమా పరంగా ఆయన గురించి చెప్పగలనని… పవన్ సినిమా ఆడకపోయినా తదుపరి చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయని తెలిపారు.