హీరో లలో కింగ్ నాగార్జున సినిమాలు అనగానే చాలా మందికి గుర్తొచ్చే ఒకేఒక సినిమా మన్మథుడు. నాగ్ సినిమాల్లో కామెడీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ అంటే పక్కా ఈ సినిమానే అని ప్రతి ప్రేక్షకుడు బల్ల గుద్ది చెబుతాడు. 2002 డిసెంబర్ 20న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది . ఇక టీవీలో ఈ సినిమా క్రియేట్ చేసిన తరువాత సెన్సేషన్ హిట్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తోందంటే చాలా మంది పని మానేసి మరీ టీవీలకు అతుక్కుపోతునేవుంటారు .
![మన్మథుడు మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే..? 2 మన్మథుడు మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-17T131045.042.jpg)
అయితే ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ కాబోతోందట. అక్కినేని నాగార్జున బర్త్‌డే స్పెషల్ సందర్భంగా ఆగస్టు 29న మన్మథుడు సినిమాను 4k ప్రింట్లతో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించేసారు .
అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున స్వయంగా ఈ సినిమా నిర్మించగా.. కె విజయ భాస్కర్ స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం వహించాడు . అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. ఈ చిత్రంలో సోనాలి బింద్రే, అన్షు కథానాయికలుగా నటించిన విషయం మనఅందరికి తెలిసిందే. ఈ మూవీలో నాగ్-బ్రహ్మీల మధ్య వచ్చే సీన్స్ సూపర్ హైలైట్‌గా నిలిచిపోయాయి .