Manushi Chhiller : మానుషి చిల్లర్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫ్యాషన్ దుస్తులతో చేసే ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఈ దివా ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తుంటుంది. లేటెస్ట్ ట్రెండ్స్ కు తగ్గట్లుగా ఫ్యాషన్ గేమ్‌ను ఎలా అప్‌గ్రేడ్ చేయాలో చూపించడంలో ఈ బ్యూటీ ప్రసిద్ది చెందింది. సాధారణ అవుట్ ఫిట్స్ నుండి మోడరన్ వస్త్రధారణ నుండి ఎత్నిక్స్ వరకు, మానుషి ఫ్యాషన్ డైరీలు వైవిధ్యమైనవి. అన్ని రకాల అవుట్ ఫిట్స్ ను తనదైన స్టైల్ లో ధరించి ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ ను అందిస్తుంది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ఈ చిన్నది తరచుగా ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. ఫ్యాషన్ ప్రేమికులు ఆమె లుక్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ నోట్స్ తీసుకుంటుంటారు.

తాజాగా ఈ బ్యూటీ రెడ్ కార్పెట్ లుక్ కోసం ఎత్నిక్ వేర్ ను ఎన్నుకుని అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది. ముంబైలో జరిగిన ఒక అవార్డుల వేడుకకు హాజరైన ఈ నటి తన లుక్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ లెహేంగా తో చేసిన ఫోటో షూట్ చిత్రాలలో అద్భుతంగా కనిపించింది. మానుషి, రెడ్ కార్పెట్ లుక్ కోసం నీలి రంగు సిల్క్ లెహంగాను ఎంచుకుంది.

మానుషి పొడవాటి చేతులతో, సిల్వర్ రేషమ్ థ్రెడ్‌లలో ఎంబ్రాయిడరీ వర్క్‌తో, డీప్ నెక్‌లైన్ తో వచ్చిన నీలిరంగు సిల్క్ బ్లౌజ్ ను వేసుకుంది. ఈ బ్లౌజ్ కు జోడిగా ఆమె ఎంబ్రాయిడరీ వర్క్‌తో పొడవాటి ఫ్రిల్స్ తో డిజైన్ చేసిన నీలిరంగు స్కర్ట్ ను జత చేసింది. సరిహద్దుల వద్ద వెండి ఎంబ్రాయిడరీ వర్క్, సిల్వర్ జరీ వర్క్‌ను కలిగి ఉన్న జార్జెట్ బ్లూ దుపట్టాను ఈ సెట్ కు జోడిగా వేసుకుంది.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మానుషీ ఎంబెడెడ్ వైట్ స్టోన్స్ తో వచ్చిన నెక్ లెస్ ను ధరించింది. దానికి మ్యాచింగ్ గా డ్యాంగ్లర్స్ ను చెవులకు పెట్టుకుంది. సునీతా గుప్తా షెల్ఫ్‌ల నుండి ఈ జ్యూవెల్లరీని ఎన్నుకుంది ఈ సుందరి. ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా జె గిలానీ మానుషీకి స్టైలిష్ లుక్స్ ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ జార్జ్ పి కృతికోస్ సహాయంతో, మానుషి తన కనులకు స్మోకీ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా ను వేసుకుంది. పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని అదరగొట్టింది ఈ బ్యూటీ.
