MC Mary Com : భారతదేశపు గొప్ప క్రీడాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించే 5 మంది సభ్యుల ప్రభుత్వ ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తుంది. మేరీకోమ్ నేతృత్వంలోని కమిటీ సిట్టింగ్ డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడి పై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయనుంది. ఈ కమిటీ వచ్చే నెల రోజుల పాటు రెజ్లింగ్ సంస్థ రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తుంది. విచారణ ముగిసే వరకు చీఫ్‌గా బ్రిజ్ భూషణ్ సింగ్‌ను పక్కకు తప్పుకోవాలని అనురాగ్ ఠాకూర్ ప్రకటిచారు.

సిట్టింగ్ డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కదిలింది. రెజ్లింగ్ సంస్థ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించాలని ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ ని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్యానెల్‌లోని ఇతర సభ్యులలో ఒలింపిక్ పతాక విజేత రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యురాలు తృప్తి ముర్గుండే, మాజీ టాప్ సీఈఓ రాజగోపాలన్ SAI మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ ఉన్నారు.

ఈ పర్యవేక్షణ కమిటీ ఈ రోజే ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కమిటీకి మేరీకోమ్ నేతృత్వం వహిస్తారు. రాబోయే నెలలో, రెజ్లర్లు పెట్టిన ఆరోపణలపై కమిటీ దర్యాప్తు చేస్తుంది, అని ఠాకూర్ మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో మీడియాతో అన్నారు. గత వారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రపంచ ఛాంపియన్లు , ఒలింపిక్ పతాక విజేతలు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ , రవి దహియా ఇతరుల నేతృత్వంలోని రెజ్లర్ల నిరసన నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.

మహిళా రెజ్లర్లను నేషనల్ క్యాంపస్ లో కోచ్‌లు , WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ శర్మ కూడా లైంగికంగా వేధించారని ఫోగట్, గత వారం ప్రెస్ మీట్లో ఆరోపణలు చేశారు . నేషనల్ క్యాంపస్ లో నియమించబడిన కొంతమంది కోచ్‌లు కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారన్నారు . WFI అధ్యక్షుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని తెలిపారు. జాతీయ శిబిరాల్లో లైంగిక వేధింపుల గురించి చాలా మంది యువ మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు ,ఏడ్చారు అని ఆమె తెలిపింది.