Megastar Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీతో రాజకీయాలలో చురుకుగా ముందుకి వెళ్తున్నారు. తనని తాను ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ప్రస్తుత రాజకీయాలని అర్ధం చేసుకుంటూ తన భావజాలాన్ని ప్రజలకి చేరువ చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో కచ్చితంగా అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని అన్ని విధాలుగా అణచివేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్న సంగతి తెలిసిందే.

అధికార పార్టీ అయితే ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పై పదే పదే విమర్శలు చేస్తూ టీడీపీకి అంటకాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ ని తమతో పాటు ఉంచుకొని ఓ పది, పదిహేను సీట్ల వరకు ఇచ్చి ఆ పార్టీని నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ, టీడీపీ రాజకీయాలని తట్టుకొని బలంగా ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పై స్మిత టాక్ షో నిజంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని ఒక రాజకీయ నాయకుడుగా చూడాలని అనుకుంటున్నారా లేక ఒక సినిమా స్టార్ గా చూడాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది.
దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ కి చిన్న వయస్సు నుంచి కష్టంలో ఉన్నవారిని చూస్తే సాయం చేయడం అలవాటుగా ఉంది. అతని ఆలోచనలకి నక్శలైట్స్ వైపు వెళ్లిపోతాడని అనుకున్నాను. ప్రస్తుత రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నాడు. నా వరకు అతని ఆలోచనలకి, భావజాలంకి కచ్చితంగా రాజకీయాలే సరైన వేదిక అనిపిస్తుంది. ఏ రోజుకైనా పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అవుతాడు అని బలంగా నమ్ముతున్నాను. అతనిని ఒక నటుడిగా కంటే ఒక నాయకుడిగానే నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మ్మేడియాలో వైరల్ గా మారుతున్నాయి.