‘‘అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ మనకి బోర్ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ నే ఉంటాను .. ప్రతి అడుగూ ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి సినిమా గురించి.. రీమేక్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. భోళా శంకర్ తన మనసుకు నచ్చి చేసిన సినిమా అని చిరు అన్నారు. రీమేక్‌లు చేస్తుంటారేంటని కొందరు తరచూ అడుగుతు ఉన్నారని కానీ ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పు ఏమి లేదు అని తనకు అర్థం కాదని అన్నారు.
![రీమేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 2 రీమేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-07T122354.454.jpg)
‘ఈ ‘భోళా శంకర్’ మాతృక ‘వేదాలం’ ఏ ఓటీటీ వేదికలోనూ అందుబాటులో లేదని ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ చిత్రం చేసేందుకు ముందుకొచ్చా. ఇది కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఇది సూపర్ హిట్టవుతుందని ఒక భరోసా అందరిలో కనిపించింది.’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.