టాలీవుడ్ కు ఈతరంలో పెద్దన్న లాగా అభిమానులు, యంగ్ హీరోలు అందరూ ఆదర్శంగా తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి వయసు పైబడుతున్నా సినిమాలపై మక్కువతో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తేరు వీరయ్య తో మెగా బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా అందుకున్న చిరు .. ఈ రోజు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . దాదాపు పదేళ్ల పాటుగా మెగా ఫోన్ పట్టని డైరెక్టర్ మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చారు చిరంజీవి.. ఎందుకంటే కళామతల్లిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే వారిలో చిరు ఒక్కడు . అందుకే మెహర్ రమేష్ ను నమ్మి ఇంతటి పోటీ ఉన్న పరిస్థితుల్లో కూడా నేను అవకాశం ఇచ్చాడు. కానీ మెహర్ రమేష్ ఆ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవడంలో పూర్తిగా విఫలం అయినట్లు తెలుస్తోంది. తమిళ్ లో గతంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశాడు . హ్యూమన్ ట్రాఫికింగ్, చెల్లెలి సెంటిమెంట్ తో తీసిన సినిమాలో రొటీన్ స్టోరీ, సాగదీత కథనంతో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడట మెహర్ రమేష్.
![మెహర్ రమేష్ కు లైఫ్ ఇద్దామనుకున్న మెగాస్టార్..అసలేం జరిగింది..? 2 మెహర్ రమేష్ కు లైఫ్ ఇద్దామనుకున్న మెగాస్టార్..అసలేం జరిగింది..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-11T121259.670.jpg)
చిరంజీవి, కీర్తి సురేష్ నటన మరియు ఫైట్ సీన్స్ కొంతమేర పర్వాలేదనిపించాయని రివ్యూ లు చెబుతున్నాయి. ఇక మెహర్ రమేష్ కు ఇండస్ట్రీ లో ఎవ్వరూ అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా లేదనే చెప్పుకోవాలి . తన గత చిత్రాలు షాడో , కంత్రి , బాబీ, శక్తి సినిమాల ఫెయిల్యూర్స్ నుండి ఏమీ నేర్చుకోలేదు మెహర్ రమేష్ గారు .