Mumbai : విస్తారా అబుదాబి-ముంబై విమానంలో సిబ్బందిపై దాడి చేసినందుకు 45 ఏళ్ల ఇటాలియన్ మహిళను అరెస్టు చేశారు. ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను కొన్న పావోలా పెరుక్కియో, బిజినెస్ క్లాస్‌లో కూర్చోవాలని పట్టుబట్టి, సిబ్బందిపై దాడికి పాల్పడిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఆమె క్యాబిన్ సిబ్బందిని కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి, విమానంలో పాక్షిక నగ్నంగా నడిచి రచ్చ రచ్చ చేసింది. ఆమె వికృత హింసాత్మక ప్రవర్తన కారణంగా విమానం మధ్యలో కంట్రోల్ చేయాల్సి వచ్చిందని క్యాబిన్ క్రూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు, అయితే ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సదరు మహిళా పాసెంజర్ వికృత ప్రవర్తన ,హింసాత్మక ధోరిణిని దృష్టిలో ఉంచుకుని, కెప్టెన్ హెచ్చరిక కార్డును జారీ చేసి, కస్టమర్‌ను నిరోధించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. పైలట్ ఇతర కస్టమర్లకు వారి భద్రత గురించి భరోసా ఇవ్వడానికి క్రమం తప్పకుండా ప్రకటనలు చేశాడు. మార్గదర్శకాలు మరియు మా కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం, విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఆ మహిళపై చర్య తీసుకోవాల్సిందిగా ఆన్-గ్రౌండ్ భద్రతా ఏజెన్సీలకు తెలియ చేసారని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది.
కోరిన సీట్ ఇవ్వలేదన్న నెపంతో ఆమె తన బట్టలు కొన్ని తీసివేసి, పాక్షిక నగ్న స్థితిలో నడిచింది, దుర్భాషలు ఆడి సిబ్బందిపై దాడి చేసింది.ఈ క్రమంలో ఫిర్యాదు మేరకు ప్రయాణికురాలిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఒక రోజులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి ముందు మహిళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సహ ప్రయాణీకులు, సిబ్బంది ఇతరుల స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.