Nani : ‘అష్టా చెమ్మా’ మంచి హిట్ కొట్టడంతో తొలి సినిమాతోనే నేచురల్ స్టార్ నాని దశ తిరిగిపోయింది. తరువాత వచ్చిన సినిమాలన్నీ వరుస విజయం సాధించడంతో ప్రేక్షకుల గుండెల్లో నేచురల్ స్టార్‌గా మిగిలిపోయాడు. ఆ తరువాత ఏమాత్రం విరామం లేకుండా షూటింగ్‌ల మీద షూటింగ్‌లు చేసేవాడు. స్టార్ హీరోలవి ఎవరివైనా ఏడాదికి ఒక సినిమా మాత్రమే వస్తే.. నానివి మాత్రం 3-4 సినిమాలు వచ్చేవి. అంత బిజీగా గడిపిన స్టార్ హీరో ఇప్పుడు సినిమాల కోసం వెదుక్కోవాల్సి వస్తోందంటూ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నాని చేతిలో కేవలం ఒక్కటంటే ఒక్క సినిమానే ఉండటం ఈ టాక్‌కు బలాన్నిస్తోంది.
Nani : అహంభావం తలెక్కిందన్న కామెంట్స్..
ముఖ్యంగా ‘అంటే సుందరానికి’ తర్వాత నాని స్పీడ్ బాగా తగ్గింది. చేతిలో ఒక్క సినిమా మినహా మరొకటి లేదు. ఈ సినిమా కూడా ఫట్ అన్నదంటే ఇక అంతే సంగతులు. నాని కెరీర్ ఇబ్బందుల్లో పడిపోతుందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. అసిస్టెంట్ దర్శకుడు స్థాయి నుంచి నాని స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. అప్పట్లో చాలా ఒబిడియంట్‌గా కనిపించిన నానికి తర్వాత అహంభావం తలెక్కిందన్న కామెంట్స్ కూడా బాగానే వినిపించాయి. స్టార్డమ్ ఆయనలో గర్వాన్ని నెత్తికెక్కించిందని టాక్ బాగా నడిచింది. తర్వాతర్వాత అసలు నాని ఊసే లేదు. ఇప్పుడు నానికి క్రేజ్ తగ్గిందో.. వరుస ఫ్లాపులు ప్రభావం చూపిస్తున్నాయో కానీ నానికి చెంతకు ఒక్క కథ కూడా రావడం లేదని టాక్.
అటు ఇటుగా ఏకకాలంలో మొదలు పెట్టిన మూడు సినిమాలు ‘టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. అయితే ఈ మూడింటిలో శ్యామ్ సింగరాయ్ ఫర్వాలేదు అనిపించినా.. అంతకు ముందు నాని సాధించిన విజయాలతో పోలిస్తే మాత్రం ఇదొక విజయంగానే పరిగణించకూడదు. మొత్తానికి ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా మూవీతో మంచి హిట్ కొట్టాలని నాని గట్టిగానే కోరుకుంటున్నాడు. అయితే మరోమారు ఆలోచించాడో ఏమో కానీ తనకు డిసెంబర్ బాగా కలిసొస్తుండంతో తిరిగి ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. మరి నాని డిసెంబర్ సెంటిమెంట్ ఈ సారి వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.