Nani: నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన అంటే సుందరానికి అనే చిత్రంకు మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రం దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది.
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా వీళ్లిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై భలే అనిపించింది. అయితే వీళ్లిద్దరు మళ్ళీ జత కడుతుండడంతో వీళ్ళని చూడడానికి రెండు కళ్ళు చాలవేమో. అయితే ఈ చిత్రం మాత్రం వచ్చే ఏడాది మార్చ్ లో రాబోతుంది. అయితే ఈ సినిమాకి ఇప్పడి నుంచే బజ్ ని క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పడికే నాని దసరా మూవీ లుక్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ లుక్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని పోలి ఉందని కొందరు తమ అభిప్రాయాలని వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈ మధ్యలోనే విడుదలైన ధూమ్ ధామ్ దోస్తానా అనే పాత నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ పాటలో నాని చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
Nani:
అయితే ఈ లుక్ ఎలా ఉందంటే మాసిన లుంగీ, గుబురు గడ్డం, చింపిరి జుట్టుతో అచ్చం పుష్పలో అల్లు అర్జున్ ఎలా ఉన్నడో అలానే నాని కూడా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకో విచిత్రం ఏమిటంటే కీర్తి సురేష్ లుక్ కూడా పుష్పలో రష్మిక అయితే ఎలా ఉందో అలాగే ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా పుష్ప లుక్ ని ఈ సినిమాలో దించడం వల్ల పెద్దగా ప్రత్యేకం ఏం కనిపించట్లేదు అని వరకరకాలుగా స్పందిస్తున్నారు.