Nani: ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది హిట్ అనే చిత్రం. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల సమయంలోనే హిట్ మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే ఏ సినిమాకి సీక్వెల్ తీసినా ఆ సీక్వెల్ లో మొదటి పార్ట్ లో ఎవరైతే నటిస్తారో సీక్వెల్ లో కూడా ఆ హీరోనే ఖచ్చితంగా నటిస్తారు. కానీ ఇక్కడ కొంచం రివర్స్ అయింది. విశ్వక్ సేన్ కి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాలో అడవి శేష్ కి అవకాశం వచ్చింది. ఇప్పుడు అడవి శేష్ హీరో హిట్ 2 ని రూపొందిసున్నారు.
అయితే ఈ విషయంపై విశ్వక్ సేన్ స్పందిస్తూ హిట్ చాలా మంచి సినిమా. ఆ సినిమాని డేట్స్ లేక వదులుకోవడం చాలా బాధాకరం అని చెప్పాడు. అయితే నాని కూడా విశ్వక్ సేన్ కి ఒక సలహా ఇచ్చాడట. ఒక్కో పార్ట్ ఒక్కో హీరోతో చేస్తే బావుంటుందని చెప్పాడట. అయితే ఆ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తే మాత్రం తప్పకుండ హీరో మారుతాడని కూడా విశ్వక్ సేన్ చెప్పాడు. అయితే ఈ సినిమా నాని సమర్పణలో ప్రశాంతి తిపిరనేని నిర్మిస్తున్నారు.
అయితే ఈ ఫ్రాంచైజీ తో నాని పెద్ద ప్లాన్ యే వేసేశాడు. అదేంటంటే హిట్ 2,3,4 ఈ సినిమాలని ఒక్కో హీరో తో తీసి తర్వాత ఆ నలుగురిని కలిపి ఇంకో సినిమా తీయాలని ప్లాన్ చేసేసాడు. అయితే హిట్ కి హిట్ 2 కథ కి అసలు సంబంధమే ఉండదని హిట్ సినిమాలో విశ్వక్ సేన్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తే హిట్ 2 లో అడవి శేష్ మాత్రం చాలా కామ్ గా ఉంటాడట.
Nani:
అయితే అడవి శేష్ మేజర్ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకున్నాడో అందరికి తెలిసిందే. మేజర్ తర్వాత హిట్ 2 వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొదటగా ఈ సినిమా జులై లోనే విడుదల చేయాలని అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో డిసెంబర్ 2 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.