అబద్దానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చం జగన్ రెడ్లనే ఉంటుందని, అతను నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతాడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమే అని, మద్యపానం నిషేధం అబద్దం, జాబ్ క్యాలెండర్ అబద్ధం, ప్రత్యేక హోదా అబద్ధం, మూడుముక్కల రాజధాని అబద్ధం అంటూ నారా లోకేష్ ఘాటుగా విమర్శలు చేశారు. వైసిపి పార్టీ జెండా పట్టి జగన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు నాయకులను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని నారా లోకేష్ విమర్శించారు. అయితే టిడిపిలో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి పార్టీ అండగా ఉండడంతో పాటు వారిని గౌరవంగా పలకరించే సాంప్రదాయం ఉందని అన్నారు.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అధిష్టానం ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కి వెళ్లిందని అయితే మంగళగిరి ఎమ్మెల్యే వేషాలు వీధి నాటకాలు చూసి ఆస్కార్ కి పంపిస్తే కచ్చితంగా అవార్డు వస్తుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై నారా లోకేష్ వ్యంగంగా విమర్శలు చేశారు. ఆయన వేసే వేషాలు, నాటకాలు చూసి కరకట్ట కమల్ హాసన్ అనే పేరు పెట్టారని అన్నారు.
నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తో ఎన్ని కోట్లు దోచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రోడ్లు వేస్తామని ప్రతి ఊర్లో ప్రజలు ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారో ఎమ్మెల్యే చెప్పాలని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షంలో అడ్డుకునే కుట్రలు అడుగడుగున జరుగుతున్నవని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో తన తండ్రి చంద్రబాబుని తిరగాకుండా ఆడుకోవడంతోపాటు అక్రమ కేసులు బనాయించారని నారా లోకేష్ విమర్శలు చేశారు.