Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. యువగళం పేరుతో చేపట్టిన ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు లోకేష్ వంద కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇక చిత్తూరు జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఇక ఈ పాదయాత్రకి టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇక ప్రజలు కూడా స్వచ్చందంగా వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా లోకేష్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకి ప్రజల నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక వైసీపీ మూడేళ్ళ కాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులని ప్రజలు నారా లోకేష్ తో చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పాదయాత్రని నారా లోకేష్ కూడా చాలా యాక్టివ్ గా కొనసాగిస్తున్నారు.

ఇక ఈ యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే నాయకుడిగా తనని తానను ఏమర్జ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పాదయాత్రతో ఆ పార్టీకి ఒరిగేది ఏమీ లేదని వైసీపీ నేతలు ఓ వైపు కామెంట్స్ చేస్తూనే మరో వైపు లోకేష్ చేస్తున్న విమర్శలపై భుజాలు తడుముకుంటున్నారు అనే మాట టీడీపీ వర్గాలలో వినిపిస్తుంది. లోకేష్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి వైసీపీ భయపడుతుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నారా లోకేష్ జగన్ పై ఘాటుగా విమర్శలు చేస్తూ ఉండటంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి బూతులు తిడుతూ ఉండటం విశేషం.
దీనిని బట్టి లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవుతుందనే విషయాన్ని అధికార పార్టీ వైసీపీ గుర్తిస్తుంది అని టీడీపీ భావిస్తుంది. అదే సమయంలో పాదయాత్ర ప్రజల్లోకి బలంగా వెళ్తుందని కూడా నమ్ముతున్నారు. కచ్చితంగా ఈ పాదయాత్ర పూర్తయ్యే సరికి అన్ని నియోజకవర్గాలలో టీడీపీ క్యాడ మరల నూతనుత్తేజంతో బలంగా పనిచేస్తుందని, ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వచ్చి మెజారిటీ స్థానాలలో గెలిచే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ వారాహితో యాత్ర చేపట్టబోతున్నారు. అప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.