వైవిధ్య కథలను ఎంచుకుంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంటాడు నారా రోహిత్. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. . ఓ పొలిటికల్ డ్రామాతో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రోహిత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ప్రతినిధి’ 2014లో పొలిటికల్ థ్రిల్లర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకు నారా రోహిత్ రాబోతున్నాడు.
![‘ప్రతినిధి-2’లో అదిరిపోయే పోస్టర్ తో వస్తున్న నారా రోహిత్ 2 ‘ప్రతినిధి-2’లో అదిరిపోయే పోస్టర్ తో వస్తున్న నారా రోహిత్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-25T154825.295.jpg)
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు’. పోస్టర్లో హీరో నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. తాను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, కొండకళ్ల రాజేందర్ రెడ్డి ,ఆంజనేయులు శ్రీ తోట సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తుండగా..సినిమాటోగ్రాఫీ గా నాని చమిడిశెట్టి బాధ్యతలు చూస్తున్నారు. ఈ సినిమాకు రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ కాగా ,ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.