Nayanthara : తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలను ఏకకాలంలో శాసించిన అతికొద్ది మంది నటీమణుల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌లో నయన తార ముందు వరుసలో ఉంటుంది. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అమోఘం. దాదాపు అన్ని భాషల్లోనూ నయన చిత్రం వస్తోందంటే హిట్ పక్కా అని అంచనా వేస్తారు. ప్రారంభంలో నటనే రాదు అని నెగిటివ్ ట్రోల్స్ ను ఎదుర్కొన్న నయన్ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
రీసెంట్‌గా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని , ఇద్దరు కవల పిల్లలకు అమ్మ కూడా అయ్యింది. అయితే తాజాగా నయర్ సినిమా ఇండస్ట్రీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, నుంచి టెలివిజన్ పరిశ్రమ వరకు చాలా మంది నటీనటులు కాస్టింగ్ కౌచ్‌తో తమ అనుభవాలను పంచుకున్నారు. నయనతారకు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లోనే ప్రత్యక్షంగా కాస్టింగ్ కౌచ్ బారిన పడిన అనుభవం కూడా ఉంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

నయనతార ఇటీవల హారర్ చిత్రం కనెక్ట్‌లో కనిపించింది. తమిళ డైరెక్టర్ అట్లీ హిందీలో తొలిసారిగా తెరకెక్కిస్తోన్న షారుక్ ఖాన్ మూవీ జవాన్‌లో షారుఖ్ సరసన నటిస్తోంది. గత సంవత్సరం, జరిగిన నయన్ విఘ్నేష్ శివన్ పెళ్లిలోనూ షారుఖ్ పాల్గొని జంటను దీవించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలి జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో క్యాస్టింగ్ కౌజ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. చిత్రంలో కీలకమైన పాత్రను పొందాలనుకుంటే తమకు ఫేవర్ గా ఏం చేస్తావు అని అడిగేవారని వెల్లడించింది. తనపై , తన టాలెంట్‌పై నమ్మకం ఉండటంతో ఎంతో ధైర్యంగా నేను ఈ అవకాశాన్ని తిరస్కరించానని చెప్పొకొచ్చింది నయన్.

38 ఏళ్ల ఈ నటి సినిమాల్లో తన ప్రయాణం పూల పాన్పు కాదని అన్ని హెచ్చు తగ్గులు తనకు చాలా నేర్పించాయని చెప్పింది. ఇండస్ట్రీ నుంచి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి, కానీ అదంతా తనకు ఓ రకంగా మేలు చేసిందని తెలిపింది. నేను చేసిన తప్పులు, మంచి ,చెడు దశలు అన్నింటి నుంచి ఎంతో అనుభవం దక్కిందని తెలిపింది. సుమారు 19 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండటం అంత సులువైన విషయం కాదని, ప్రేక్షకుల ప్రేమ, దేవుడి దయే నన్ను ఈ స్థానంలో ఉంచాయని తెలిపింది.

మీరు మీ కళ పట్ల నిజాయితీగా ఉంటే, నైపుణ్యం ఉండి మీ పనిని మీరు బాగా చేయగలిగితే అదే పని చేస్తుంది అని తెలపింది. అప్పుడు ప్రేక్షకులు మీతో కనెక్ట్ అవుతారని, వారు మీతో ప్రేమలో పడతారని, అంతకు మించి మీ జీవితంలో అతిపెద్ద ఆనందం మరేముంటుంది అని తెలిపింది.