Netflix ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ అగ్రస్థానంలో ఉంటుంది. సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు వేలల్లో అందుబాటులో ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ తీసుకున్న వారు పాస్ వర్డ్ షేరింగ్ చేసుకుంటుండంతో సంస్థకు నష్టాలు పెరుగుతున్నాయి. దీంతో తాజాగా ప్రొఫైల్ ట్రాన్స్ఫర్ ఫీచర్‌ను భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ ప్రకారం యూజర్ కు సంబంధించిన వ్యూయింగ్ హిస్టరీతో పాటు సిఫార్సులు, మైలిస్ట్, సేవ్ చేసిన గేమ్స్ సహా పలు అంశాలను ఇతర అకౌంట్స్ కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇకపై ఒకసారి ఒకరు మాత్రమే అకౌంట్‌ను ఉపయోగించేలా మార్పులు చేయనుంది. ట్ ఫ్లిక్స్ వినియోగదారులు తమ ఖాతాలను బదిలీ చేయాలనుకునే వెబ్ లో, మీ ప్రొఫైల్ కు యాక్సెస్ ఉన్న అకౌంట్ కు సైన్ ఇన్ చేయడం ద్వారా మొదలు పెట్టవచ్చు.
వినియోగదారులు వారి నెట్ ఫ్లిక్స్ అకౌంట్ పేజీని కూడా చూసే అవకాశం ఉంటుంది. లేదంటే వారి హోమ్‌పేజీలో డ్రాప్ డౌన్లో ఈ ఎంపికను చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే, Netflix ప్రొఫైల్ బదిలీలో భాగంగా చెల్లింపు సమాచారం కొత్త అకౌంట్ కు బదిలీ చేయబడదు. అలాగే, పిల్లల ప్రొఫైల్‌లు మరియు PIN- ప్రొటెక్టెడ్ ప్రొఫైల్‌లు కూడా బదిలీ చేయబడవు.
Netflix యాడ్స్‌తో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్
మరోవైపు వినియోగదారుల కోసం యాడ్ సపోర్ట్ టైర్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అంటే యాడ్స్ ఉండే సబ్‌స్క్రిప్షన్‌ను కాస్త తక్కువ ధరకు అందించనుంది. ఈ మేరకు పలు దేశాలలో ‘బేసిక్ విత్ యాడ్స్’ స్ట్రీమింగ్ ప్లాన్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది కూడా. ఒక వేళ యాడ్స్ లేకుండా కావాలనుకుంటే కాస్త ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.