సలార్ ( ప్రభాస్)కంటే కేజీఎఫ్ 2 టీజర్ చాలా బెటర్ అని తేల్చేశారు నెటిజన్లు. గురువారం (జులై 6) తెల్లవారుఝామున రిలీజైన ఈ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ నచ్చేయగా.. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరిచారు.
ఎంతగానో ఆసక్తి రేపిన సలార్ టీజర్ గురువారం ఉదయం 5:12 గంటలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఊహించినట్లే ఈ టీజర్ రిలీజైన మరుక్షణం నుంచే ఫ్యాన్స్ దానిని విశ్లేషించడం మొదలుపెట్టారు. మొదట చాలా వరకూ పాజిటివ్ రివ్యూలు రాగా.. తర్వాత మెల్లగా నెగటివ్ కూడా మొదలయ్యాయి. సలార్ టీజర్ ను కేజీఎఫ్ 2 టీజర్ తో పోలుస్తున్నారు.
![సలార్ టీజర్ పై నెటిజన్లు ఫైర్...సలార్ కంటే కేజీఎఫ్ 2..? 2 సలార్ టీజర్ పై నెటిజన్లు ఫైర్...సలార్ కంటే కేజీఎఫ్ 2..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-06T121729.179.jpg)
ఓ యూజర్ అయితే కేజీఎఫ్ 2 కాదు కదా.. ఐదేళ్ల కిందట వచ్చిన కేజీఎఫ్ 1 టీజర్ కూడా సలార్ కంటే చాలా బాగుందని కామెంట్ చేశారు. ముఖ్యంగా ఈ టీజర్ లో ప్రభాస్ లుక్ ను పూర్తిగా రివీల్ చేయకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు మేకర్స్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని ఓ యూజర్ ట్వీట్ చేశారు.
కొన్ని వారాల ముందు నుంచే సలార్ టీజర్ పై హైప్ క్రియేట్ చేశారు. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదని ఊహించుకున్నారు. తీరా టీజర్ మాత్రం ఆ రేంజ్ లో లేకపోయేసరికి నిరాశ చెందారు. నిజానికి మరీ ఎక్కువ అంచనాలతో ఎదురు చూడటం కూడా ఒక రకంగా సలార్ టీజర్ కు ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.