New Delhi : దేశ రాజధానిలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి నిన్నటికి నిన్న సీక్రెట్ గా పెళ్లి చేసుకుని గత కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న సాహిల్ తన పార్ట్నర్ నిక్కీ యాదవ్ ని అతి కిరాతకంగా కేబుల్ చంపి ఫ్రిడ్జ్ లో దాచి తాను చేసిన దారుణాన్ని కప్పివు పెట్టే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కుకున్నాడు. తాజాగా అదే ఢిల్లీలో తాను చేస్తున్న తప్పును నిలదీసినందుకు గాను సహజీవనం చేస్తున్న మహిళను టార్పిన్ ఆయిల్ పోసి నిప్పంటించి చంపే ప్రయత్నం చేశాడు ఓ ప్రబుద్దుడు . ఇంతలో ఇంట్లో మంటలు చెలరేగడం తో ఇరుగుపొరుగువారు చూసి సదరు మహిళను హాస్పిటల్ కు తరలించారు, అయితే చికిత్స తీసుకుంటున్న మహిళ ఈరోజు చనిపోయింది.

వాయువ్య ఢిల్లీలోని అమన్ విహార్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. డ్రగ్స్‌పై వివాదం తలెత్తడంతో 28 ఏళ్ల మహిళను తన భాగస్వామి నిప్పంటించాడని తెలుస్తోంది. ఫిబ్రవరి 11న, కాలిన గాయాలతో మహిళను ఎస్‌జిఎం ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆసుపత్రికి చేరుకోగా, మహిళ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి కుదరలేదని తెలిపారు. సదరు మహిళ వాయువ్య ఢిల్లీలోని బల్బీర్ విహార్ నివాసిగా గుర్తించారు. ఆమె పాదరక్షల ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేస్తోంది.

ఎస్‌జిఎం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కు రెస్పొంద్ కాకపోవడంతోతదుపరి చికిత్స కోసం ఆమెను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి, ఆపై ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.బాధితురాలు తన భర్తను విడిచిపెట్టి, నిందితుడు మోహిత్‌తో గత ఆరేళ్లుగా నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు హాస్పిటల్ కు వెళితే ఆమె ఆసుపత్రిలో మరణించిందని, పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు అధికారి తెలిపారు.

ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా అమన్ విహార్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి మోహిత్ తన స్నేహితుడి వద్ద డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించిన మహిళ అతనితో వాగ్వాదానికి దిగిందని ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయని సీనియర్ అధికారి తెలిపారు.
నిందితుడు ఆమెపై టార్పిన్ ఆయిల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు.మోహిత్‌ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని వారు పేర్కొన్నారు.