లైగర్ సినిమా ఘోర పరాజయం తో విజయ్‌దేవరకొండ ఇప్పుడు ఎలాగైనా ఓ హిట్ తన ఖాతాలో వేసుకోవాలి అని ఎదురుచూస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ హీరోగా సమంత హీరోయిన్ నటిస్తున్న ‘ఖుషి’ . ఈ చిత్రంపై చాల ఆశలు పెట్టుకున్నాడు విజయ్ .విజయ్, సమంత ఇద్దరూ పాన్ ఇండియా లెవల్లో ఫాన్స్ ఉండడం తో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ముస్లిం యువతి పాత్రలో సమంత, ఆమెను ప్రేమించే హీరో పాత్రలో విజయ్ కనిపించనున్నారు.
![పెళ్లి చేసుకున్న కొత్త జంట! సమంత, విజయ్....గుడిలో యాగం 2 పెళ్లి చేసుకున్న కొత్త జంట సమంత, విజయ్....గుడిలో యాగం](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-05T133516.098.jpg)
సమంత :
సమంత ఆరోగ్యం సమస్యలతో షూటింగ్ స్టార్టింగ్ లో కొంత ఆలస్యం అయింది . ఆ తర్వాత వరుస షెడ్యూల్స్ తో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుంది .తాజాగా రాజమండ్రి దగ్గరలోని ఓ దేవాలయంలో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటుంది అని సమచారం.
ఇదే క్రమంలో షూటింగ్ స్పాట్ నుంచి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఏ వీడియోలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య గుడిలో యాగం చేస్తున్నారు. చీరకట్టులో సమంత, పంచ కట్టులో విజయ్ అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటగా కనిపించారు. ఇద్దరూ చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించారు. ఇక ఈ వీడియో చుస్తే ఎండ్ టైటిల్స్ పడే సీన్ లా ఉంది అని అనిపిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని కూడా తెలుస్తోంది. దీనిపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 1న పలు భాషల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.