ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతం లో భక్తి పేరుతో ఈయన చేసిన రాసలీలల గురించి అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.తమిళ నటి రంజితతో ఈయన చేసిన శృంగార వీడియో వార్తల్లోకి రాగ కేసు నుండి తప్పించుకొని దేశం నుండి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని నిర్మించుకున్న సంగతి తెలిసిందే.
నిత్యానంద :
ఆ దేశానికి కైలాస (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) అని పేరు పెట్టుకున్నాడు అని తెలుస్తుంది.ఆ దేశానికి ప్రత్యేక కరెన్సీని, పాలన విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా నిత్యానంద వార్తల్లో నిలిచాడు. తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటిస్తున్నట్టు సమాచారం.ఈ మేరకు ఒక ప్రముఖ తమిళ పత్రిక ఈ విషయాన్నీ వెల్లడించింది.
నటి రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ సినిమాలలోనటించింది.ఆమె పిక్స్ లో ఉండగానే నిత్యానంద వద్దకు చేరింది. నిత్యానంద, రంజిత మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా గతంలో పెద్ద ఎత్తున జరిగింది.