మిస్ చేసుకున్న నితిన్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తెలంగాణకు చెందిన హీరో నితిన్ జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు నితిన్ . 2002 సంవత్సరంలో వచ్చిన జయం మూవీ లో హీరోగా నితిన్ హీరోయిన్గా సదా నటించి అందరిని మెప్పించారు. ఈ సినిమా విజయం తర్వాత దిల్, సై, సంబరం లాంటి ఎన్నో సినిమాలు చేశారు హీరో నితిన్.
![టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం మిస్ చేసుకున్న నితిన్ ? 2 టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం మిస్ చేసుకున్న నితిన్ ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-35-1.jpg)
ఇక ఇటీవల మాచర్ల నియోజకవర్గం మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు హీరో నితిన్. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించిన కృతి శెట్టి హీరోయిన్గా నటించి అందరిని మెప్పించారు. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా కలెక్షన్స్ లని మాత్రం బాగా రాబట్టగలిగింది. ఇది ఇలా ఉండగా హీరో నితిన్ గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ నిత్యమీనన్ ను హీరో నితిన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట .
ఈరోజు నితిన్ మరియు హీరోయిన్ నిత్యమీనన్ కాంబినేషన్లో రెండు మూవీ లు వచ్చాయి. ఇష్క్ మరియు గుండెజారి గల్లంతయిందే సినిమాలలో వీరిద్దరూ హీరో, హీరోయిన్ లుగా నటించి అందరిని నడిపించారంట . అయితే ఇష్క్ మూవీ సమయంలోనే హీరో నితిన్ మరియు హీరోయిన్ నిత్యామీనన్ ప్రేమించుకున్నారంట . వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారంట . అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల… ముఖ్యంగా హీరో నితిన్ తల్లిదండ్రుల కారణంగానే వీరిద్దరి వివాహం క్యాన్సల్ అయిందంట . దీంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హీరో నితిన్.