భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కూడా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ మూవీ విడుదల కాబోతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. చాలా మంది ప్రముఖులు ఈ సినిమాలో భాగం కానున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి భార్య లక్ష్మి ప్రణతి అంటే చాలా ఇష్టమనే విషయం మన అందరికీ తెలిసిందే .
![భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..? అందుకోసమేనా ? 2 భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..? అందుకోసమేనా ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-13.jpg)
ఎన్టీఆర్ వరుస పరాజయాలతో ఉన్నప్పుడు.. ప్రణతితో పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్నారంట . ఈ నేపథ్యంలో తన విజయాల్లో భార్య ప్రణతితో చాలా సార్లు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటుంటారు. ఈ సినిమా చేసిన తరువాత గ్యాప్ వస్తే భార్య ప్రణతి ఇద్దరూ పిల్లలు అభిరామ్, భార్గవరామ్ లతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తుండేవారు.తారక్ కి తొలుత నుంచి కూతురుంటే బాగుంటుందనే కోరిక ఉండేది. ఫస్ట్ టైమ కొడుకు పుట్టిన తరువాత రెండోసారి కూతురు పుడుతుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డారంట . కానీ రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది.
ఈ నేపథ్యంలోనే లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డ కోసం ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ పై అప్పట్లో ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగిందట. కానీ ఆ రకంగా మూడోసారి ఆడపిల్ల పడుతుందేమో అని తన భర్త ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందేమోనని.. అనుకున్నదంట లక్ష్మి ప్రణతి . వైద్యులు ఇప్పటికే ఇద్దరూ పిల్లలను కన్నారు. మూడోసారి అంటే ప్రణతి ఆరోగ్యం బలహీనం అవుతుందని.. చెప్పారట. అయినా ప్రణతి త్వరగా ఆమె చెప్పే రీతిలో వ్యవహరించిన క్రమంలో ఎన్టీఆర్.. మొదట నీ ఆరోగ్యం ముఖ్యం.. ఇంకేమి ఆలోచించకూడదు అని ఇద్దరు పిల్లతో సరిపోతుందని కొద్దిగా కోపంగా ప్రణతితో కలిసి చెప్పి ఒప్పించాడట ఎన్టీఆర్.