యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులలో ఎంత క్రేజ్ ఉందో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం ఆయన దేవర అనే సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాలో కూడా నటించనున్నారు. ఈ సినిమాలపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతుండగా ఎన్టీఆర్ కూడా వేగంగా షూటింగ్లను పూర్తి చేస్తూ .. ఆ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకోవాలని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తారక్ సినిమాలకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడనిచెప్పుకోవచ్చు . ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు.
![కొడుకు చేసిన పనికి షాక్ లో ఎన్టీఆర్.. ఏమైందంటే..? 2 కొడుకు చేసిన పనికి షాక్ లో ఎన్టీఆర్.. ఏమైందంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-12T170817.074.jpg)
తన కొడుకు అభయ్ రామ్ ను నాన్న కోసం పుట్టావా? అమ్మకోసం పుట్టావా ? అని అడిగితే నాన్న కోసం అని చెప్పేవాడని అయితే ఒక రోజు నేను షూటింగ్లో బిజీ గా ఉండడం వల్ల ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 9 గంటల వరకు సెట్స్ లోనే ఉండేవాడిని.. నా కొడుకు స్కూల్ కి వెళ్తుండడంతో ఉదయం నేను ఇంటికి వెళ్లే సమయానికి లేవట్లేదని.. రాత్రి ఇంటికి వెళ్లే సమయానికి పడుకుండిపోతాడని జూనియర్ ఎన్టీఆర్ తన వాక్యాలను వెల్లడించారు.
ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు అభయ్ నా దగ్గరకు నాన్న అంటూ వచ్చేసాడు . ఆ సమయంలో నాన్న అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా? అని అడిగితే అభయ్ రామ్ అప్పుడు అమ్మ అన్నాడని.. ఇది మనకు తెలియకుండా ఎలా జరిగిందని అనిపించింది అని కూడా ఎన్టీఆర్ కామెంట్ చేయడం గమనార్హం. ఇక ఆ సమయంలో కొడుకు అన్న మాటలకు తాను ఆశ్చర్యపోయానని ఎన్టీఆర్ వెల్లడించారు. పిల్లలు ఎవరితో ఎక్కువసేపు గడిపితే వాళ్లపైనే ఎక్కువ ప్రేమను పెంచుకుంటారు అని, తాను ఇంట్లో ఎక్కువ సేపు పిల్లలతో గడప లేకపోవడం వల్ల తన పిల్లలకు తన తల్లి అంటే ఇష్టమని పరోక్షంగా వెల్లడించారు.