అవుట్ సైడ్ మాత్రమే కాదు ఇన్ సైడ్ కూడా ఎన్టీఆర్ చాలా అందంగా ఉంటారు అని అన్నది ఇండస్ట్రీలో బాగా టాక్. అయితే.. ఆన్ స్క్రీన్ పెర్ఫార్మన్స్ గురించి ఇక చెప్పక్కర్లేదు. అది అలా ఉంచితే తారక్ తన లుక్స్ విషయంలో వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. నార్మల్ గానే స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టేసే తారక్ తాజాగా తన లుక్ ను మరింత పూర్తిగా మేక్ ఓవర్ చేసారు. ఈ న్యూ లుక్ తో తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
![వైరల్ అవుతున్న ఎన్టీఆర్ మేక్ ఓవర్ ఫోటో..! 2 వైరల్ అవుతున్న ఎన్టీఆర్ మేక్ ఓవర్ ఫోటో..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-10T115628.925.jpg)
దక్షిణ భారత మరియు ఉత్తర భారత సెలెబ్రిటీలు కూడా చాలా ఇష్టపడే స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీమ్ ఎన్టీఆర్ ను మేక్ ఓవర్ చేసారు. తాజా గా మేక్ఓవర్ తర్వాత చాలా స్టైలిష్గా కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హకీమ్ ఎన్టీఆర్ తో కలిసి తీసుకున్న ఫోటోను నెట్టింట్లో పెట్టడంతో ఈ ఫొటోకు ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. . సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్గా కనిపించనున్నారు, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ముఖ్యమైన పాత్రల నటనతో పాటు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.