పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ఓజి. దర్శకుడు సుజిత్. నిర్మాత దానయ్య. ఈ డిఫరెంట్ సినిమా మీద ఫ్యాన్స్ కు చాలా ఆశలు ఉన్నాయి. ఈ సినిమా ఏడాది క్రిస్మస్ విడుదలవుతుందని ఓ టాక్ ఉంది. ఫ్యాన్స్ కూడా అదే హోప్ తో వున్నారు.
బ్రో సినిమా వారి ఆకలి తీర్చలేదు. ఉస్తాద్ సినిమా సంక్రాంతికి అంటున్నారు కానీ అది షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది రెండు మూడు రోజులు చిన్న షెడ్యూలు మాత్రమే చేసి ఆగింది.. ఇలాంటి నేపథ్యంలో ఓజి మీదే ఆశలు అన్నీ.కానీ ఇప్పుడు టాలీవుడ్ లో విశ్వాసనీయ వర్గాల బొంగట్టా ఏమిటంటే ఓజీ సినిమా విడుదల ఏప్రిల్ 2024 లో ఉంటుందన్నది .
![ఓజి విడుదల ఏప్రిల్ 2024..? 2 ఓజి విడుదల ఏప్రిల్ 2024..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-12T162542.396.jpg)
సినిమా వర్క్ దాంతోపాటు సిజీ వరకు కాస్త ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. అందువల్లే డిసెంబర్లో రావడం కష్టమవుతుందని ఫ్రీ సమ్మర్ లేదా సమ్మర్ లో విడుదల ఉండొచ్చా అని తెలుస్తుంది. నిర్మాత దానయ్య కూడా ఒకరిద్దరితో ఏప్రిల్ లో విడుదల ఉంటుందని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయ ఇదిలా ఉంటే సంక్రాంతికి ఉస్తాద్ భాగత్ సింగ్ విడుదల ఉంటుందని వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ ని బ్రో విడుదల తర్వాత నిర్మాతలకు మేరకు క్లారిటీ ఇచ్చారని షెడ్యూల్ రెడీ చేయనున్నారని ఆ వార్తల సారాంశము అంటే ఈ లెక్కన ఎన్నికల ముందు రెండు సరైన సినిమాలు ఉండేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోవాలి.