విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఓరి దేవుడా. విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో దేవుడి పాత్రలో కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విశ్వక్ మొదటి సినిమా నుంచి కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి తనని తాను పరీక్షించుకుంటున్నాడు. పాగల్ సినిమాతో ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే తమిళ్ హిట్ మూవీ ఓమై కడపులే సినిమా రీమేక్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఓరి దేవుడా టైటిల్ తో వచ్చిన ఈ మూవీలో ప్రేమకథని సరికొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు. స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ఈ కథలో కామెడీ టచ్ లో చెప్పారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఆహా ఛానల్ లో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది.
అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది అఫీషియల్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఇక చాలా రోజుల తర్వాత విశ్వక్ సేన్ కూడా ఈ మూవీతో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. వెంకటేష్ క్యారెక్టర్ కూడా బాగానే కనెక్ట్ కావడంతో కామెడీకి కొదవలేకుండా పోయింది. సినిమా ఆధ్యంతం నవ్వులు పండిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. వీటికి పోటీగా సర్దార్, ప్రిన్స్ సినిమాలు ఉన్నాయి. అయితే అవి డబ్బింగ్ మూవీస్ గా ఉండటంతో వాటికంటే ఓరి దేవుడా సినిమా ఎక్కువగా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ ఉండటం విశేషం.