Pakistan : పాకిస్థాన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 25 మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారు. స్థానిక హాస్పిటల్ క్షతగాత్రులను పరిశీలించిన అధికారులు ఈ విషయాన్నీ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఈ బాంబు ప్రమాదంలో మసీదు పైకప్పు , గోడ నిర్మాణంలో కొంత భాగం కూలిపోయింది. బాంబు ఘటనలో మసీదు ప్రాంతమంతా రక్తసిక్తమైనది. శిథిలాల కింద నుంచి చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసారు.మృతదేహాలను స్వీకరించామని, ఇది అత్యవసర పరిస్థితి అని పెషావర్‌లోని ప్రధాన ఆసుపత్రి ప్రతినిధి ముహమ్మద్ అసిమ్ ఖాన్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో గాయపడిన 39 మందికి వైద్య సేవలు అందుతున్నాయని అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపినట్లు సమాచారం

గత మార్చిలో, పెషావర్‌లోని మైనారిటీ షియా మసీదుపై ISIS ఆత్మాహుతి బాంబర్ దాడి చేసారు. 2018 నుండి పాకిస్తాన్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 64 మంది మరణించారు.