Pakistan : పాకిస్తాన్ చారిత్రాత్మక గరిష్ట స్థాయికి పెట్రోలు , గ్యాస్ ధరలను పెంచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో మిని బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. రూపాయి రెండు రూపాయలు కాదు ఏకంగా రూ.22.20 పెంచింది. దీంతో ప్రస్తుతం అక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.272 అయ్యింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగం నుండి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

ఇక డీజిల్ ధరలను అదే స్థాయిలో పెంచింది పాక్. 17.20 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం హైస్పీడ్ డీజిల్ ధర అక్కడ లీటరుకు రూ.280 పలుకుతోంది. రూ.12.90 పెంపు తర్వాత కిరోసిన్ నూనె ఇప్పుడు లీటరుకు రూ.202.73 అందుబాటులో ఉంది. ఇక తేలికపాటి డీజిల్ ఆయిల్ ను రూ.9.68 పెంచిన తరువాత లీటరుకు రూ.196.68 కు అందుబాటులో ఉంటుంది.

కొత్త ధరలు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని జియో న్యూస్ నివేదించింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల వాషింగ్టన్ ఆధారిత రుణదాత ముందస్తు షరతులలో ఒకటి. ఇది మినీ-బడ్జెట్ ద్వారా చేపట్టిన కొత్త ఆర్థిక చర్యలలో ఒకటి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో మినీ బడ్జెట్ తర్వాత పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా.
మూడీస్ అనలిటిక్స్‌తో సంబంధం ఉన్న సీనియర్ ఆర్థికవేత్త కత్రీనా ఎల్, 2023 ప్రథమార్థంలో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం సగటున 33 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.మినీ-బడ్జెట్ ద్వారా, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ నేతృత్వంలోని సమాఖ్య ప్రభుత్వం బడ్జెట్ లోటును తగ్గించడం, పన్నుల వసూళ్లను విస్తృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపింది.