Pathaan Records : పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతోంది. భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులను సృష్టిస్తుంది. రిలీజ్ కి ముందు అనేక వివాదాలను ఎదుర్కొన్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కే జి ఎఫ్ 2 బాహుబలి 2 సినిమాల రికార్డులను చెరిపేసి తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.250 కోట్ల క్లబ్ లో చేరి అంతకు ముందు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించిన పఠాన్ చిత్రం జనవరి 25న రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానాన్ని పొందుతుంది. ఈ మూవీ తో షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇస్ బ్యాక్ అని నిరూపిస్తున్నారు.

పఠాన్ మూవీ అత్యంత వేగంగా వరల్డ్ వైడ్ గా కేవలం ఐదు రోజుల్లోనే రూ.271 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. కే జి ఎఫ్ 2 ఈ రికార్డును సాధించడానికి ఏడు రోజులు పట్టగా బాహుబలి 2 కి 8 రోజులు పట్టింది. పఠాన్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డులను కొల్లగొట్టడమే పనిగా ముందుకు దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ త్రిల్లర్ గా తిరిగెక్కిన ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

పఠాన్ ఇంతటి విజయం సాధించడం వెనక ఓ సీక్రెట్ ఉంది. దాదాపుగా ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్ పఠాన్ తో రీ ఎంట్రీ ఇస్తుండటంతో మూవీపై భారీ క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందే సినిమా సాంగ్స్ నెట్ లో లైక్ లు షేర్లతో సునామీని సృష్టించాయి. దీపిక అందం షారుక్ యాక్షన్ ఈ మూవీ కి ప్లస్ పాయింట్స్. ఈ మూవీకి ముందు షారుఖ్ జీరో సినిమాలో నటించారు. అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పెద్దగా స్క్రీన్ అలరించలేకపోయింది. ఆ తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకుని షారుక్ పఠాన్ తో మళ్ళీ తన జోరు పెంచాడు. షారుక్ సినిమా హిట్ తో బాలీవుడ్ మళ్లీ కళకళలాడుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయంటూ పండగ చేసుకుంటుంది.