సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జరిగిన కాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏంటో మంది తారలు ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులుగా మీడియా ముందుకి వచ్చారు. ఇండస్ట్రీలో తమకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు. అయితే ఇండస్ట్రీలో జరిగే ఈ లైంగిక వేధింపులని కొంత మంది వ్యతిరేకిస్తే మరికొంత మంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు అయితే వేధింపులు ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటాయని అంటున్నారు. ఇక వ్యక్తికి క్లోజ్ గా ఉండటం, ఉండకపోవడం అనేది అమ్మాయి ఇష్టం అని అంటున్నారు.
ఒక అమ్మాయి ఇష్టంతో లేదంటే తన అవసరం కోసం ఎవరితో అయిన బెడ్ షేర్ చేసుకుంటే అది తప్పే కాదని అంటున్నారు. అయితే వద్దన్న తర్వాత కూడా అదే పనిగా వేధించడం మాత్రం తప్పని చెబుతున్నారు. రీసెంట్ గా యంగ్ బ్యూటీ దివి వాదత్యా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇష్టపడి వెళ్లడం అస్సలు తన దృష్టిలో తప్పే కాదని చెప్పింది. ఇదిలా ఉంటే సీనియర్ హీరోయిన్, ప్రస్తుతం తల్లి పాత్రలతో మెప్పిస్తున్న పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయం చెప్పింది.
అందమైన ఆడవాళ్ళతో కోరిక తీర్చుకోవాలని ప్రతి మగాడికి ఉంటుందని ఆమె కామెంట్స్ చేశారు. అలాగే హీరోయిన్ అవ్వాలని డ్రీమ్ తో వచ్చినపుడు అది ఫుల్ ఫిల్ చేసుకోవడానికి పడుకోవటం అస్సలు తప్పు కాదని, అలా స్టార్ హీరోయిన్స్ అయిన వారు చాలా మందేది ఉన్నారని చెప్పింది. అలాగే స్త్రీ, పురుష సంబంధం అనేది ప్రకృతి ధర్మం అని దానికి కాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేసినట్లు టాక్. ఇష్టపడి చేస్తే ఏది తప్పుకాదని కూడా పవిత్ర లోకేష్ కామెంట్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ యాక్టర్ నరేష్ తో రిలేషన్ లో ఉందనే సంగతి ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయం. ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవిత్ర లోకేష్ చేసిన పాత కామెంట్స్ అన్ని బయటకి వస్తున్నాయి.