మాస్ మహారాజు రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి పవిత్ర లోకేష్ కీలక పాత్రలో నటించింది. ఇక ఆమెతోపాటు సీనియర్ నటుడు నరేష్ కూడా మరో కీలక పాత్రలో కనిపించాడు. మామూలుగా అయితే వీళ్ళు పెర్ఫార్మన్స్ ఎలా చేశారో అని మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. అయితే ఈ మధ్యకాలంలో పవిత్ర లోకేష్, సీనియర్ నరేష్ మధ్య ఉన్న రిలేషన్ గురించి మీడియాలో హాట్ టాపిక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మైసూర్ లో హోటల్ లో కూడా ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారని ప్రచారం కూడా విస్తృతంగా కొనసాగుతుంది. ఇక మీడియాలో కూడా ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు. కన్నడ నటి ఆయన పవిత్ర లోకేష్ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. టాలీవుడ్ లో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ప్రస్తుతం ఈమె కొనసాగుతుంది. అయితే సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ ఇష్యూ వైరల్ అయిన తర్వాత ఒక్కసారిగా ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా ఆమెపై మీమ్స్ కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దీంతో పవిత్ర లోకేష్ ని తెరపై చూసిన ప్రతిసారి ప్రేక్షకులు ఊహించిన విధంగా సందడి చేయడం థియేటర్లో కనిపించింది. ఓ విధంగా చెప్పాలంటే రవితేజ కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ కంటే పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ప్రేక్షకులు అరుపులతో సందడి చేయడం సరికొత్తగా అనిపించింది. మొత్తానికి ఒకే ఒక్క ఇష్యుతో పవిత్ర లోకేష్ ఇప్పటివరకు రాని క్రేజ్ ను సొంతం చేసుకుందాం అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఈ హైప్ ఆమెకి మరింతగా టాలీవుడ్ లో ఫేమ్ తీసుకురావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది
.