Pavitra Naresh: సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ లివింగ్ రిలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. జనవరి ఒకటో తేదీన త్వరలో పెళ్లి చేసుకుంటామని నరేష్ ఒక వీడియో రిలీజ్ చేసి తెలియజేశారు. ఆ తర్వాత నరేష్ ఫ్రెండు భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్లి ఎలా చేసుకుంటారో చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. తర్వాత పవిత్ర, నరేష్ పైన యూట్యూబ్ లో రకరకాల మీమ్స్ కూడా వచ్చాయి. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తప్పుడు ప్రచారాలు జరిగాయి. దీనిపై వారు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు.
ఇక అనంతరం నరేష్ మీడియా ముందుకి వచ్చి తనతో ఇప్పుడో బంధం కట్ అయిపోయింది అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆమె కారణంగా తన కుటుంబం ఎంత మానసిక క్షోభకు గురైంది కూడా తెలియజేశారు. ఇదిలా ఉంటే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అలాగే హనీమూన్ కి వెళ్ళినట్లు కూడా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దీంతో పవిత్ర లోకేష్ నరేష్ పెళ్లి పెళ్లి చేసుకున్నారు అనే మాట ఎప్పుడు వినిపిస్తుంది.
అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని టాక్ కూడా వినిపిస్తుంది. ఇంటింటి రామాయణం అనే సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేసినట్లుగా తెలుస్తుంది. నరేష్ కూడా మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఇంటింటి రామాయణం ప్రెస్ మీట్ లో కలుసుకుందాం అంటూ సమాధానం దాటవేశారు. ఆ తర్వాత సినిమా ప్రెస్ మీట్ లో నరేష్ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేవలం ప్రమోషన్ స్ట్రాడ్జిలు భాగంగానే నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి వీడియోని షేర్ చేశారని మాట తెరపైకి వచ్చింది.