జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి నూతన కార్యవర్గానికి అభినందనలు చెప్పారు . తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు
అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
![తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పైన కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..! 2 తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పైన కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-02T115639.168.jpg)
ఏదైనా ఒక సినిమా తీస్తున్నారంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. .రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది.. పన్నులు చెల్లిస్తారని.. తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ బాగా విస్తృతమవుతోందన్నారు. కాబట్టి తెలుగు పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా చేస్తుందని ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.