Pooja hedge: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు సల్మాన్ ఖాన్ కి జోడీగా హిందీలో ఒక సినిమా చేసింది.
ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డేగా ఖరారు అయ్యింది. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు గత ఏడాది కాలికి గాయం కావడంతో ఇంటికే పరిమితం అయ్యింది.
అయితే మరల ఈ ఏడాది ఆరంభం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికప్పుడు బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తుంది. పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోవాలని ఈ అమ్మడు ఆశపడుతుంది. ఆ దిశగానే సినిమాలని ఎంపిక చేసుకుంటుంది అనేది టాక్.
ఈ నేపధ్యంలో చిన్న చిన్న అవకాశాలు వచ్చిన ఒప్పుకోవడం లేదనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. దీంతో పూజా హెగ్డే చేతిలో ఈ ఏడాది హిందీలో ఒకటి తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. ఆమె ఫోకస్ అంతా ప్రస్తుతం వాటిమీదనే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ ఈవెంట్ లో పాల్గొంది. అందులో భాగంగా పూజా హెగ్డే వేసిన డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. థైస్ అందాలు కనిపించే విధంగా లాంగ్ ఫ్రాగ్ వేసిన ఈ అమ్మడు అదే స్థాయిలో ఎద అందాలని కూడా చూపిస్తుంది. కార్పెట్ పై వయ్యారంగా నడుస్తూ కెమెరాలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.