ఒక లైలా కోసం అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమా లలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం గత ఏడాది నుంచి ఈమెకు కలిసి రావడం లేదని చెప్పాలి. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుంటుంది. అయినా కూడా అవకాశాలు మాత్రం తలుపు తడుతున్నా కూడా కొత్త ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు. పైగా సైన్ చేసిన మూవీ ల నుంచి కూడా తప్పుకుంటుందని సమాచారం.
![సర్జరీకి సిద్ధమైన పూజా హెగ్డే.. అందుకే సినిమాలకు దూరం..! 2 సర్జరీకి సిద్ధమైన పూజా హెగ్డే.. అందుకే సినిమాలకు దూరం..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-28T132307.352.jpg)
ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం వంటి ఈ రెండు సినిమాలే ఇందుకు నిదర్శనమని చెప్పుకోవచ్చు . మొదట రెండు మూవీ లు చేయడానికి ఒప్పుకున్న ఈమె ఆ తర్వాత రెండింటి నుంచి కూడా తప్పుకుంది. అయితే తాజాగా పూజా హెగ్డే టీం దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. నిజంగానే పూజా హెల్దీ గా లేదని, గత సినిమాలలో నటించే టైంలో డాన్స్ చేసేటప్పుడు తన కాళ్లకు గాయాలయ్యాయని, ఇక మేజర్ సర్జరీ కూడా చేయించుకుందని వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె కొత్త మూవీ లు ఒప్పుకోవడం లేదని సమాచారం.
మొత్తానికైతే పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందని తెలిసి ఆమె అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ సినిమా లలోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఏ మేరకు పూజా హెగ్డే తన తదుపరి సినిమా పై ఫోకస్ పెడుతుందో లేదో చూడాలి.