ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకోలీ ఆత్మహత్య చేసుకున్నారు. హాంకాంగ్‌కు చెందిన ఈ సింగర్ లీ గత కొన్నేళ్లుగా తీవ్రమైన వ్యాకులత (డిప్రెషన్)తో బాధపడుతోందని డిఫ్రెషన్‌తో బాధపడుతోన్న లీ దాని నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమె పరిస్థితి మరింత విషమించి ఈ నెల 4న ఆత్మహత్యకు ప్రయత్నించగా అపస్మారకస్థితిలోకి చేరుకున్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కోమాలోకి వెళ్లిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు..లీ మృతితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు.ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
![ప్రముఖ సింగర్ డిప్రెషన్‌తో ఆత్మహత్యా .... 2 ప్రముఖ సింగర్ డిప్రెషన్‌తో ఆత్మహత్యా ....](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/c117b7e2-7c69-4c6e-8b07-73f6d7861116.jpg)
సింగర్ :
హాంకాంగ్‌లో జన్మించిన లీ శాన్ఫ్రాన్సిస్కోలో పెరిగింది. ఆ తర్వాత పాప్ సింగర్‌గా కెరియర్ను ప్రారంభించిందిలీ తొలి ఆల్బమ్ ‘కోకో లీ’.. అసియాలో అమ్ముడుపోయిన అత్యధిక అల్బమ్‌గా నలినిచింది. లీ మొత్తం 18 స్టూడియో ఆల్బమ్ రికార్డింగ్‌లు చేసింది.
మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, స్టాన్లీ క్వాన్, నో టొబాకో అనే మూడు చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ సింగర్. 1998లో వచ్చిన మాండరిన్ ఆల్బమ్ డి డా డి జస్ట్ మూడు నెలల్లోనే మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి అంటే ఆమె ఎంత పాపులరో అర్ధం చేసుకోవచ్చు..