Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలను ఈ ఏడాదిలో పూర్తి చేసి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జూన్ నెలలో ఆదిపురుష్ మూవీ రిలీజ్ కాబోతుండగా, సెప్టెంబర్ లో సలార్ సినిమా రిలీజ్ అవుతుంది. మల్ల జనవరి 12కి ప్రాజెక్టు కె సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడు సినిమాలు కచ్చితంగా ఒక్కోటి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే ఏడాది వేసవిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ రిలీజ్ అవుతుంది. తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో యాక్సిడెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న శివ దర్శకత్వంలో ఒక సినిమాకి ప్రభాస్ ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కొద్దిసేపు యువరాజు పాత్రలో కనిపిస్తాడని సమాచారం. పిరియాడికల్ ఫిక్షనల్ జోనర్లో ఈ సినిమాని దర్శకుడు శివ తెరకెక్కించే యువతలో ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతానికి ఈ దర్శకుడు తమిళ్ స్టార్ హీరో సూర్యతో పవర్ఫుల్ పిరియాడికల్ యాక్షన్ జోనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య సొంత నిర్మాణ సంస్థలో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణ భాగస్వామిగా ఉండబోతుందని టాక్. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.