Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అతి పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అతని మీద ఏకంగా రెండు వేల కోట్ల వరకు సినిమా వ్యాపారం జరుగుతుంది. బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాకపోయిన ప్రభాస్ మానియా మాత్రం తగ్గలేదని చెప్పాలి. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రస్తుతం ప్రభాస్ ఉన్నాడు. ప్రాజెక్ట్ కె కోసం అతను ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతను సలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల షూటింగ్ కూడా జరుగుతుంది.

అలాగే స్పిరిట్ మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాల రిలీజ్ చూసుకుంటే ఇప్పుడు టాలీవుడ్ లో అందరికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే స్టార్ హీరోలు అందరూ తమ సినిమాల రిలీజ్ కచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. ఏ మాత్రం ఈ నేపధ్యంలో ఈ ఏడాది జూన్ నుంచి ప్రభాస్ సినిమా రిలీజ్ సందడి మొదలు కాబోతుంది. రెండేళ్ళు ప్రతి సినిమాకి గ్యాప్ తీసుకుంటాడు అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో ప్రభాస్ షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ ఏడాది జూన్ 16న ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. ఇక మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలకి మధ్య మూడు నెలలు మాత్రమే గ్యాప్ ఉంది. ఇక దాని తర్వాత సంక్రాంతి కానుకగా నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కె మూవీ జనవరి 12న రిలీజ్ అవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సలార్ రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ప్రాజెక్ట్ కె రిలీజ్ అవుతుంది. ఆ మూవీ రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత వేసవిలో మారుతి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి గ్యాప్ ఇవ్వకుండా నాలుగు సినిమాలని చాలా తక్కువ టైమ్ లో ప్రభాస్ రిలీజ్ చేస్తూ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.