Prabhas: తమ అభిమాన హీరో అభిమానాన్ని చాలా మంది ఫ్యాన్స్ రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఫ్యాన్ష్ ఫాలోయింగ్ ఎక్కువ. అందులోనూ అగ్ర హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో డార్లింగ్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడనడంలో ఆశ్చర్యం లేదు. వర్షం సినిమాతో మొదలు.. ఛత్రపతి, బిల్లా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు ప్రభాస్. తర్వాత రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. డార్లింగ్ ఎక్కడున్నా రాజేరా.. అని అభిమానులు రొమ్ము విరిచి చెప్పేంత గొప్పతనం ప్రభాస్ ది.
ఇటీవల కృష్ణం రాజు చనిపోయిన బాధలోనూ ప్రభాస్.. తన అభిమానుల కోసంచేసిన పని కట్టిపడేసింది. కృష్ణం రాజు అంతిమ కార్యక్రమాల కోసం మొగల్తూరు వెళ్లిన ప్రభాస్.. లక్షలాది మంది అభిమానులకు భోజన ఏర్పాట్లు చేయించాడు. అంత బాధలోనూ భోజనం తినేసి వెళ్లండి డార్లింగ్స్… అంటూ ప్రేమతో చెప్పడం అభిమానుల గుండెల్ని పిండేసింది. ప్రభాస్ రియల్ కింగ్.. అంటూ అభిమానులు ఆనంద భాష్పాలు రాల్చారు.
రక్తంతో ప్రభాస్ చిత్రం..
తాజాగా ప్రభాస్ కోసం ఓ అభిమాని రక్తం చిందించాడు. తన అభిమాన హీరో కోసం రక్తాన్ని త్యాగం చేశాడు. ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ఫ్యాన్స్ కు రక్తదానం కోసం పిలుపునిచ్చాడు. తన రక్తంతో ప్రభాస్ పెయింటింగ్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇలా చేసిన డార్లింగ్ ఫ్యాన్ పేరు లాల్ ప్రసాద్ అని తెలుస్తోంది. ఆయన తన రక్తంతో ప్రభాస్ బొమ్మ పెయింటింగ్ వేసి రక్తదానం చేయాలని.. ఇతరుల ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు.
Prabhas
ఈ వీడియో నెట్టింట చూసిన అభిమానులు అతడి చర్యకు ఫిదా అవుతున్నారు. ఇదీ డార్లింగ్ ఫ్యాన్స్ అంటే… అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ కోసం ఏం చేయడానికైనా అభిమానులు సిద్ధమని చెబుతున్నారు. బర్త్ డే రాక ముందే ఇంత హంగామా మొదలైందంటే.. ఇక బర్త్ డే రోజు ఇంకెంత హడావుడి ఉంటుందోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆరోజు ఫ్యాన్ష్ చేసే హంగామా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.