కన్నడ భామ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాతృబాషలో మొదటిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో భావ సినిమాలో సిద్దార్ధ్ కి జోడీగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.
మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులే వేయించుకుంది. ఆ తరువాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తెలుగులో బాగానే సక్సెస్ అయ్యింది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఆమె సక్సెస్ ని అందుకోలేకపోయింది. అందం, అభినయం ఉన్నాకూడా తెలుగు దర్శకులు ఈమెకి సరైన అవకాశాలు ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత నటించింది.
అలాగే ఎన్ఠీఆర్ కి జోడీగా రభస సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో కూడా ఒక హీరోయిన్ గా ప్రణీత కనిపించి మెప్పించింది. అయితే పూర్తిస్థాయి రోల్ మాత్రం కాదు. ఇక అవకాశాలు వస్తున్నా కూడా అవి ఆశించిన స్థాయిలో ఆమెకి గుర్తింపు అయితే తీసుకురాలేదు.
ఇక మాతృభాషలో మాత్రం ప్రణీత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక చివరిగా ఆమె హిందీలో హంగామా2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తరువాత సినిమాలకి స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుంది. బెంగుళూరులో ఒక వ్యాపారవేత్త నితిన్ రాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఓ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.
అయితే కడుపుతో ఉన్న సమయంలో ఏ మాత్రం వన్నెతగ్గని అందంతో ప్రణీత మెరిసిపోతుంది. తాజాగా ఆమె తన హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇవి కాస్తా వైరల్ గా మారాయి. కడుపుతో ఉన్న సమయంలో కూడా ప్రణీత అందం ఏ మాత్రం తగ్గలేదని ఆ ఫోటోలు చూస్తున్న వారు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.