శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ప్రిన్స్. ఈ మూవీ మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అనుదీప్ తెరకెక్కించారు. జాతిరత్నాలు తర్వాత మరోసారి తనదైన శైలిలో కామెడీ టైమింగ్ డైలాగ్స్, కంటెంట్ తో శివ కార్తికేయన్ ని తెలుగులో ఫస్ట్ హిట్ అందించాడు. అలాగే తమిళంలో హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు. ఇక శివ కార్తికేయన్ నుంచి అతను ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
అలాగే అనుదీప్ సినిమాలో ఏం ఆశించి అయితే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తారో అలాంటి సింగిల్ లైన్ కామెడీ డైలాగ్స్ కూడా మెప్పించాయి. సీరియస్ పాయింట్ ని కూడా ఫన్ జోనర్ లోనే అనుదీప్ చెప్పే ప్రయత్నం చేసి అందరిని మెప్పించాడు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు హ్యాపీ నవ్వుకుంటూ థియేటర్స్ నుంచి బయటకి వస్తున్నారు. అనుదీప్ బయటకి సైలెంట్ గా ఉన్నా కూడా ప్రేక్షకులు ఎలాంటి కామెడీ కావాలో బాగా అర్ధం చేసుకొని అందిస్తున్నట్లు సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది.
సినిమాలో కంటెంట్ చెప్పుకోవడానికి ఏమీ లేకపోయిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీతోనే నడిపించేసాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం నడిపించాడు. ఇక వీకెండ్ లో ఫ్యామిలీతో వెళ్లి కాస్తా ఆహ్లాదాన్ని కోరుకునే ఆడియన్స్ కి ప్రిన్స్ కచ్చితంగా నచ్చుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కూడా కన్ఫర్మ్ అయిపొయింది. అయితే డేట్ ఎప్పుడు అనేది అఫీషియల్ గా చెప్పుకున్నా డిస్నీ హాట్ స్టార్ ఛానల్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.