మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన రాబోయే చిత్రం విలయత్ బుద్ధ షూటింగ్లో చిన్న ప్రమాదానికి గురయ్యాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు పృథ్వీరాజ్ గాయపడ్డాడని అంటున్నారు.
![పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్న యాక్సిడెంట్ కి గురయ్యాడు 2 పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్న యాక్సిడెంట్ కి గురయ్యాడు](https://rtvmedia.in/wp-content/uploads/2023/06/Untitled-design-2023-06-26T123503.393.jpg)
నివేదికల ప్రకారం, ఈ రోజు ఉదయం కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పృథ్వీరాజ్ కాలికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా, పృథ్వీరాజ్‌కు గాయం గురించి వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం, నటుడు ఆడుజీవితం, సాలార్ మరియు బడే మియాన్ చోటే మియాన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు .