ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కాస్తా జెండర్ ఆపరేషన్ తో ప్రియాంక సింగ్ గా మారింది. ఇక హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ప్రియాంక సింగ్ కట్టిపడేస్తూ ఉంటుంది. లుక్స్, బ్యూటీ పరంగా కూడా ప్రియాంక మోడల్ లా ఉంటుంది. చాలా మంది తన ఉత్పత్తులని ప్రియాంకతో ప్రచారం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి కాస్ట్యూమ్స్ లో అయిన కట్టిపడేసే రూపంతో మెరిసిపోయే ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా పాపులర్ అయ్యింది. అందులో టాప్ 6 వరకు వచ్చి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం వరకు ఆమె తన ఛరిష్మాని కొనసాగించింది.
అయితే హౌస్ లో మానస్ తో నడిపిన లవ్ ట్రాక్ ఆమెని ఫ్యాన్స్ కి దూరం చేసింది. ఇక హౌస్ లో మానస్ మీద విపరీతమైన ప్రేమని ప్రియాంక చూపించేది. ఇక హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత తన యుట్యూబ్ ఛానల్ తో అందరికి మరింత చేరువ అయ్యింది. అలాగే టెలివిజన్ షోలలో అప్పుడప్పుడు సందడి చేస్తుంది. అలాగే పలు ఈవెంట్స్ లో తన డాన్స్ కూడా అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రియాంక సింగ్ కి మంచి పాపులారిటీ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక సింగ్ హల్దీ వేడుకకి సంబందించిన ఫొటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పెళ్లి వేడుకలో అమ్మాయిని పెళ్లి కూతురుగా చేసే కార్యక్రమమే హల్దీ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో పెళ్లి కూతురుగా చిన్న చిరునవ్వుతో పసుపు రంగు చీరలో ప్రియాంకా సింగ్ కట్టిపడేసే అందంతో మెరిసిపోతుంది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ప్రియాంకా సింగ్ నిజంగానే పెళ్లికూతురు అయ్యిందా లేక ఏదైనా ఫోటో షూట్ కి సంబందించిన ఫోటోలని పంచుకుందా అనేది ఆమె చెప్పే వరకు వేచి చూడాల్సిందే.