పుష్ప -2 రిలీజ్ డేట్ ఫిక్స్: దేశమంతా మేనియా రేపిన పుష్ప ఇప్పుడు మరోసారి వార్తలకెక్కింది. ఓవైపు పుష్ప సినిమాకు జాతీయ చలన చిత్ర అవార్డులు మరోవైపు పుష్ప 2 సినిమా విడుదల తేదీ లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పుష్ప సినిమా మరోసారి దుమ్ము రేపింది. పుష్ప సినిమాలో నటనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌లు పుష్ప సినిమాకై ఎంపికయ్యారు. వెండి తెరపైనే కాదు..అవార్డుల్లో కూడా తగ్గేదే లే అంటోంది.
![పుష్ప 2 సినిమా విడుదల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే 2 పుష్ప 2 సినిమా విడుదల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-25T145413.238.jpg)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 1 సినిమా ఎంత సునామీ సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 సినిమా విడుదలపైననే ఉంది. ఈ లోగా పుష్ప సినిమా మరోసారి చర్చనీయాంసమై తగ్గేదే లే అంటోంది. ధియేటర్లోనే కాదు..అవార్డుల్లో కూడా తగ్గేది లేదని స్పష్టం చేసింది. పుష్ప సినిమాలో నటనకు అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా, ఇదే సినిమాలో సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌కు జాతీయ చలన చిత్ర అవార్డులు కూడా దక్కాయి. దీంతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పలు అావార్డులు దక్కించుకుంది. తొలిసారిగాగా తెలుగు సినిమాకు ఏకంగా పది అవార్డులు రావడం విశేషం అని చెప్ప్పుకోవచ్చు .
ఇక ఇదే సమయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా విడుదల తేదీ బయటికొచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే చాలా తేదీలు బయటికొచ్చినా..ఏదీ నిర్ధారణ కాలేదు. ఇప్పుడీ సినిమా విడుదల తేదీ దాదాపుగా పక్కాగా ఫిక్స్ అయిందని సమాచారం. 2024 మార్చ్ 22న సినిమా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చు. 2024 మార్చ్ 22వ తేదీ శుక్రవారానికి దానికి తోడు హోలీ పండుగ. ఆ తరువాత 23, 24 తేదీలు వీకెండ్స్. ఆ తరువాత శుక్రవారం 29వ తేదీ గుడ్ ఫ్లై డే, 30, 31 తేదీలు వీకెండ్స్ అంటే సినిమా విడుదలకు సరైన సమయం అని పుష్ప 2 ఇక తగ్గేది ఉండదంటున్నారు.