Raashii Khanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రాశిఖన్నా. ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.
ఈ అమ్మడు తెలుగులో కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ పాత్రలని కూడా సుప్రీం, ప్రతి రోజు పండగే, పక్కా కమర్షియల్ సినిమాలలో చేసింది. ఈ పాత్రలతో రాశిఖన్నా నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
ఇక రాశిఖన్నాలో మంచి నటి మాత్రమే కాకుండా సింగర్ కూడా ఉందనే విషయం అందరికి తెలిసిందే. తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో పాటలు పాడింది. అలా గాయనిగా కూడా రాశిఖన్నా సక్సెస్ అయ్యింది. అయితే హీరోయిన్ గానే ఎక్కువగా సినిమాలు చేయడానికి ఈమె ఫోకస్ చేయడంతో గాయకురాలిగా ప్రయత్నం చేయలేదు.
ఇదిలా ఉంటే రాశిఖన్నా చివరిగా గత ఏడాది థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. అలాగే తమిళంలో సర్దార్ సినిమాలో కార్తికి జోడీగా నటించింది. అలాగే ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈ అమ్మడు నటించింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రాశిఖన్నా ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో గ్లామర్ డోస్ పెంచింది.
రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కేవలం జాకెట్ తో ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. టెంప్ట్ చేసే ఫోజులతో కుర్రాళ్ళకి చెమటలు పట్టించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో రాశీఖన్నా అందాల ప్రదర్శన చేయడం మొదటి సారి అని చెప్పాలి.