మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కుప్పకూలింది
మిజోరాంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించిన వారికీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరియు ప్రియాంక గాంధీ తమ సంతాపం తెలిపారు.
“మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జికూలిన ఘటనలో పలువురు మృతి చెందిన విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాహుల్ గాంధీ, మరియు ప్రియాంక గాంధీ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. క్షతగాత్రలకు త్వరగా కోలుకోవాలని తెలిపారు.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 26 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సహాయక కార్యక్రమలో తమ వంతు సహాయం చేయల్సింది గా కాంగ్రెస్ కార్యకర్తలను విజ్ఞప్తి’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రియాంక గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో, “మిజోరంలో జరిగిన విషాద ఘటన లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు”. మరియు ప్రధాని నరేంద్ర మోడీ మరణించిన ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాప్రకటించారు క్షతగాత్రులకు రూ.50వేలు రూపాయలు అందజేయనున్నారు.