టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.మొన్నటి వరకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.పెళ్లి డేట్ గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్…..!
![పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీతీ సింగ్ ..... 2 పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీతీ సింగ్ .....](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-6.png)
రకుల్ ప్రీతీ సింగ్ :
ఏడాదిలోనే ఏకంగా ఐదు సినిమాలను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని తో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.ఇదే విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది.గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలలో బిజీ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వొకేషన్ ట్రిపుల్ తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు రకుల్ ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.